వర్షపు నీరు తొలగించాలని సిపిఎం

నిరసనప్రజాశక్తి – చాపాడుమైదుకూరు పట్టణంలోని వనిపెంట రోడ్డులోని కూరగాయల మార్కెట్‌ సమీపంలో రోడ్డుపై నిలుస్తున్న వర్షపు నీటిని తొలగించాలని సిపిఎం మైదుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గండి సునీల్‌కుమార్‌, షరీఫ్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోనే ప్రధాన రహదారిపై పరిస్థితి ఇలా ఉంటే పేదల కాలనీల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారాలు నిర్వహిస్తూ అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యను గుర్తించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం వర్షపు నీటిలో వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజశేఖర్‌రెడ్డి, సుబ్బరాయుడు, భీమయ్య పాల్గొన్నారు.

➡️