విజయతేజ మెడికల్‌ కాలేజీ అధినేత గిరినాథ్‌ కన్నుమూత

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఏడుగుండ్లపాడు సమీపంలోని విజయతేజ మెడికల్‌ కాలేజీ అధినేత చింతాడ గిరినాధ్‌శర్మ అనారోగ్యంతో ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం తెల్లారుజామున మృతి చెందారు.విఐపి రోడ్డులోని ఆయన నివాసం వద్ద గిరినాథ్‌ శర్మ భౌతికాయానికి విశ్వబ్రాహ్మణసంఘం యువత రాష్ట్ర నాయకులు ఏలూరి కోటేశ్వరరావు,శ్రీశైలం సత్రం ఛైర్మన్‌ ముత్తుకూరి బాలయ్య, నూతక్కికోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ పిఎస్‌.బాబు, విశబ్రాహ్మణ ఉద్యోగులసంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, బీసీ కార్పోరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కర్రి వేణుమాదవ్‌, రంగబాబు నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు తేజ, సోదరుడుబ్రహ్మానందం అంత్యక్రియలు నిర్వహించారు.

➡️