విద్యకు దూరం చేసిన జగన్‌

Feb 22,2024 19:51

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఎస్‌సిలను విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదే అని విజయనగరం నియోకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం జొన్నగుడ్డి, కోరాడ వీధి, ఎలుగుబంటి వారి వీధి, తుపాకుల వీధి ప్రాంతాలలో అవనాపు విజరుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, ఈ సందర్భంగా అదితి గజపతి మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు, ఎస్‌సిలకు ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదని, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను త్తివేసి వారికి విద్యను దూరం చేసారన్నారు, ఇలా 27 పథకాలను రద్దు చేసి దళితులను మోసం చేసారని విమర్శించారు. అంతేకాకుండా దళితులకు ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటాపోలినాయుడు, రాష్ట్ర బిసినాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌బాబు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️