విద్యారంగ సమస్యలపై పోరాటమే భగత్‌సింగ్‌కు నివాళి

Mar 22,2024 21:18

 ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేసే పోరాటమే భగత్‌సింగ్‌కు ఘనమైన నివాళి అని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి అన్నారు. స్థానిక శ్రీ శిరిడిసాయి డిగ్రీ కళాశాలలో భగత్‌ సింగ్‌ వర్థంతి నిర్వహించారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ కీలకపాత్ర పోషించారన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను కాషాయీకరణ చేస్తున్నారన్నారు. మతోన్మాదులు, కార్పొరేట్‌ సంస్థల నుంచి విద్యా రంగాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటమే వారికి నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️