విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యం

Dec 2,2023 21:26

ప్రజాశక్తి- చీపురుపల్లి  :   విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎప్‌ఐ లక్ష్యమని ఆ సంఘం జిల్లా కార్యదర్శి పూడి రామ్మోహన్‌ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల మహాసభలు చీపురుపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగాయి. ఈ సందర్భంగా రామ్మోహన్‌ మాట్లాడుతూ మండలంలో హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై, జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతులు కల్పనకై, డిగ్రీ కళాశాలలో మంచినీటి సదుపాయం కోసం, ప్రైవేటు జూనియర్‌ డిగ్రీ కళాశాలలో ఫీజులు దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలను చేసినట్లు తెలిపారు. 31వ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు నెల్లిమర్ల కేంద్రంగా జరుగుతాయన్నారు. జిల్లా మహాసభలు జయప్రదానికి చీపురుపల్లి మండలంలో ఉన్న విద్యార్థులు, ప్రజలు, మేధావులు, యువత ముందుకు రావాలని కోరారు. కొత్తగా ఎన్నికైన మండల కమిటీకి అధ్యక్ష కార్యదర్శులుగా రమణ, వంశీలను నూతన మండల కమిటీ ఎన్నుకున్నట్లు వెల్లడించారు. బాలికల కన్వీనర్‌గా రూప ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️