విద్యార్థులకు ఓటుహక్కుపై అవగాహన

ప్రజాశక్తి – ఉంగుటూరు

నారాయణపురం ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజి విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సులను ఏలూరు ఆర్‌డిఒ, ఉంగుటూరు నియోజకవర్గ ఓటు నమోదు అధికారి ఎస్‌కెఎన్‌.ఖాజావలి నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులకు వివరించారు. యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో నోడల్‌ అధికారి, హౌసింగ్‌ జిల్లా పీడీ రవికుమార్‌, ఉంగుటూరు తహశీల్దారు రమణారావు, ఎన్నికల డిటి పోతురాజు, ఉభయ కాలేజీల ప్రిన్సిపల్స్‌ టికె.విశ్వేశ్వరరావు, బివి.శ్రీనివాస్‌, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

➡️