విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 7,2024 22:05
ఫొటో : మోటివేటర్‌ను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

ఫొటో : మోటివేటర్‌ను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదవాలి
ప్రజాశక్తి-మర్రిపాడు : మార్చిలో జరుగునున్న 10, ఇంటర్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షలకు సంసిద్ధులు కావాలని ఆత్మకూరు తెలుగు భాష సేవాసంస్థ గౌరవాధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు వెలిశెట్టి నారాయణరావు కోరారు. బుధవారం ఆయన మర్రిపాడు గ్రంథాలయ ఇన్‌ఛార్జి భాండాగారి నారాయణ రావు ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు విడివిడిగా మోటివేషన్‌ క్లాసులు నిర్వహించారు. బట్టీపట్టి చదవకుండా పాయింట్స్‌ వారీగా చదవడం, వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, జింకు ఫుడ్స్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్స్‌కు దూరంగా ఉండి రాత్రివేళ మేలుకోవద్దన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, గుర్రం జాషువా, అబ్దుల్‌కలాం లాంటి వారి లక్ష్యాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. మోటివేటర్‌ నారాయణరావును జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ హనుమంత రాజు, హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు పద్మలత ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

➡️