విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మార్కాపురం : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. స్థానిక జడ్‌పి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు షేక్‌ ఇస్మాయిల్‌, అంజమ్మ శ్రీనివాస్‌, ఎంపిపిలు పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, ఎంపిడిఒ టి.చందన, ఎంఇఒలు బి.రాందాస్‌నాయక్‌, టి.శ్రీనివాసులు, ప్రధానోపా ధ్యాయులు శ్రీదేవి, మునగాల చంద్రశేఖరరెడ్డి, ఆర్గనైజర్‌ పి.రవిచంద్ర, రామాంజనేయులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్‌ అని తెలిపారు. ట్యాబ్‌లు రిపేరుకు వచ్చినా కంగారు పడవద్దన్నారు. వారం రోజుల్లో తిరిగి అందజేసే వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు పి. ఆంజనేయులు, మల్లూ నాయక్‌, వైసిపి మండల కన్వీనర్‌ కొప్పర్తి చిన్న ఓబుల్‌రెడ్డి, సచివాలయ మండల కన్వీనర్‌ జబివుల్లా, నాయకులు గురిజేపల్లి వలి, రాములు నాయక్‌, నర్రెడ్డి వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాంబాబు, హరిబాబు నాయక్‌, బొర్రారెడ్డి పాల్గొన్నారు. కొండపి : మండల పరిధిలోని కె.ఉప్పలపాడు జిల్లా పరిషత్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గ్రామ పెద్ద డాకా పిచ్చిరెడ్డి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ రాఘవ శర్మ చేతుల మీదుగాట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.సుసన్నకుమార్‌ తెలిపారు. కేశల్‌ క్విజ్‌లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన కాకర్లమూడి రేష్మ, విమృదుల, దావులూరి దీపికను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్‌, గ్రామ పెద్దలు తదితరులుపాల్గొన్నారు. పెద్దదోర్నాల : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి చిత్తూరి హారిక, ఎంఇఒ మస్తాన్‌ నాయక్‌, పాఠశాల చైర్మన్‌ చిట్టె వెంకటేశ్వరరెడ్డి, దూదేకుల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఖాసింసీరా, ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ గంటా వెంకట రమణారెడ్డి, నాయకులు గుమ్మా యల్లేష్‌ యాదవ్‌, గుండారెడ్డి రమణారెడ్డి పాల్గొన్నారు. కంభం : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి కొత్తపల్లి జ్యోతి, ఎంపిపి చెగిరెడ్డి తులసమ్మ , ఎంఇఒ మాల్యాద్రి పాల్గొన్నారు.

➡️