విద్యుదాఘాతంతో రైతు మృతి

Dec 22,2023 21:33

ప్రజాశక్తి-మెరకముడిదాం  :   మండలంలోని యాడిక గ్రామానికి చెందిన రెల్లి సూరినాయుడు(55) శుక్రవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. బుదరాయవలస హెడ్‌ కానిస్టేబుల్‌ సి.అంజిబాబు తెలిపిన వివరాలు ప్రకారం.. రెల్లి సూరినాయుడు తన పొలంలో వేసిన జొన్న చేను పంటకు నీరు కట్టేందుకు మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేశాడు. వెంటనే షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆయన భార్య తవిటమ్మ స్థానికుల సాయంతో చీపురుపల్లి సిహెచ్‌సి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️