విద్యుదా ఘాతంతో వ్యక్తి మృతి

Dec 1,2023 20:23

ప్రజాశక్తి-గజపతినగరం  :   మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఓ మూడంతస్తుల భవనంపై విద్యుత్‌ ఘాతానికి గురై శుక్రవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. జాతీయ రహదారి సమీపాన డి.నర్సింహులు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం పద్మనాభం మండలం కృష్ణాపురానికి చెందిన సుంకరి రామస్వామి(42) మద్ది గ్రామం నుంచి ఇటుక లోడు తీసుకొచ్చాడు. ఇటుకను అన్‌లోడ్‌ చేస్తుండగా, మూడంతస్తుల భవనంపైకి ఎక్కాడు. ఈ నేపథ్యంలో ఆ పక్క నుంచే వెళ్తున్న హైటెన్షన్‌ వైర్లు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. రామస్వామికి భార్య, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️