వినుకొండలో నిఘా పెంచండి

వినుకొండ: పట్టణంలో కొన్ని నెలల నుండి ఇరు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు బాహాటంగా కయ్యానికి కాలు దువ్వుతున్నారని, అందుకు పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉందని ముస్లిం చైతన్య పోరాట సమితి నాయకులు అన్నారు. తక్షణమే పట్టణంలో పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచి సమస్యాత్మక ప్రాంతంలో ఐపిసి 30, సిఆర్‌పిసి 144,151 సెక్షన్లు అమలు పరచాలని రానున్న ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగు చర్యలు చేపట్టాలని,అమాయక ముస్లిం మైనార్టీ యువకులపై అక్రమ కేసులు పెట్టవద్దని కోరారు. పాలకులు, అధికారులు ఇరువర్గాల తో శాంతియుత కమిటీ ఏర్పాటు దిశగా రెవిన్యూ అధికారులు,పోలీసు అధికారులు సంయుక్తంగా బాధ్యత తో పర్యవేక్షణ చేయాలని వినుకొండ ముస్లిం చైతన్య పోరాట సమితి తరపున డిమాండ్‌ చేశారు. అనంతరం గాయపడిన బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో వ్యవ స్థాపక అధ్యక్షులు బాజీద్‌ షేక్‌, కలాముద్దీన్‌, నబీ, వలివుల్లా, ఖాదర్‌ బాషా,సైదా వలి, న్యామతుల్లా, మస్తాన్‌ వలి, అంబేద్కర్‌ పాల్గొన్నారు.

➡️