వృద్ధులకు సాయం పంపిణీ

ప్రజాశక్తి-కనిగిరి విశ్రాంత వ్యవసాయ అధికారి దివంగత సూరసాని లక్ష్మిరెడ్డి వర్థంతిని పురస్కరించుకొని ఆయన పెద్ద కుమారుడు విజరు కుమార్‌రెడ్డి, కోడలు శివలక్ష్మి కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో గల వాసవి వృద్ధాశ్రమానికి 50 కేజీల బియ్యం, వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. సాయికృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో 20 మంది దివ్యాంగులకు, భవిత కేంద్రంలో 15 మంది చిన్నారులకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్‌కెఆర్‌ బధిరుల పాఠశాలలో 35 మంది చిన్నారులకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు సహకారం అందించడం సంతోషకరంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురసాని బ్రహ్మానందరెడ్డి, గోవిందరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️