వెంకటేష్‌కు జాండ్రపేట నాయకుల మద్దతు

ప్రజాశక్తి-చీరాల: చీరాల మండలం జండ్రపేట పంచాయతీ పరిధిలో నాయకులు చీరాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి మద్దతు తెలిపారు. జరగనున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతునిచ్చి గెలుపునకు సహకరిస్తామని తెలిపారు. ముందుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించటం పట్ల వారు పూల బొకేతో ఆయనకు శుభాకాంక్ష లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఆసాది అంకాల రెడ్డి, కుమార్‌, మద్దు ప్రకాశరావు, పన్నెం దుర్గా మహేష్‌, సత్రం యోహాను, పింజల వెంకటసుబ్బయ్య, పి వెంకటేశ్వర్లు, కామంచి నాగేంద్రం, కామంచి నాగరాజు, అయిల స్వాములు, ఏ బలరామిరెడ్డి, బండారు శ్రీనివాసరావు, పింజుల వెంకటేశ్వర్లు, సత్రం చంద్రశేఖర్‌ బాబు, సత్రం అయ్యప్ప, పింజల అయ్యప్ప కుమార్‌, పి బాలసుబ్రమ ణ్యం, ఉప్పు పార్థసారథి, సజ్జ పవన్‌, జమ్మి ప్రసాద్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

➡️