వేడుకగా రథోత్సవం

ప్రజాశక్తి – కడప రూరల్‌ తిరుమల తొలిగడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన అఖిలాండ నాయకుడు కడప రాయుడు కొలువు దీరిన రథాన్ని భక్తులు పోటీపడి ఊరేగించారు. రథోత్సవం కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కిక్కిరిసిన జనసంద్రం నడుమన శ్రీవారి రథోత్సవం రంగరంగ వైభోగంగా ప్రారంభమైంది. తొలుత టెం కాయ కొట్టి రథోత్సవాన్ని ముందుకు సాగించారు. తేరుపై గంభీరముద్ర సుందర స్వరూ పులైన ఉత్సవమూర్తులను ప్రజలు తనివితీరా తిలకించి పులకించిపోయారు. రథం ముందుకు సాగుతుండగా భక్తులు గుమ్మడి కాయలు రథచక్రాల కింద ఉంచి మొక్కలు తీర్చు కున్నారు. దేవునికడపలో ఘనంగా రథ ఊరేగింపు అనంతరం శ్రీవారి తేరు తిరిగి తన నిజస్థానంలో నిలిచింది. కడప రాయుడి సన్నిధిలో ఉపముఖ్యమంత్రి.. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌ బి అంజాద్‌ భాష సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. పండుగలు, ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలను నలుదిక్కులా పరిమళింపజేస్తాయని ఆయన అన్నారు. చెన్నూరు : స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి(కోట్ల స్వామి), సరస్వతినగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం వేద పండితులు వేడుకగా నిర్వహించారు. కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బిసి నాయకుడు నిత్య పూజయా రవీంద్రనాథ్‌రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిపి చర్ల సురేష్‌ యాదవ్‌, దిలీప్‌ కుమార్‌రెడ్డి, మొదటి సుబ్బారెడ్డి, అన్వర్‌, టి ఎన్‌ చంద్ర రెడ్డి, ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, కష్ణ పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం యువ నాయకులు చైతన్య రెడ్డి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆయన వెంట ఇంద్ర రెడ్డి శివారెడ్డి, కల్లూరు విజయభాస్కర్‌ రెడ్డి, ఆవుల పవన్‌ కుమార్‌ రెడ్డి, చెన్నయ్య, లక్ష్మీనారాయణ, ఓబుల్‌ రెడ్డి ఉన్నారు.

➡️