వైసిపికి గుడ్‌ బై చెప్పిన సర్పంచ్‌, ఎంపిటిసి

Jan 10,2024 21:00

ప్రజాశక్తి-బొబ్బిలి   :  చంద్రబాబు పర్యటనతో అధికార వైసిపికి భారీ షాక్‌ తగిలింది. బాడంగి మండలం కోడూరు ఎంపిటిసి మరిపి శ్రీదేవి, ఆమె భర్త రమేష్‌ వైసిపిని వీడి కొప్పలవెలమ పార్లమెంటరీ కన్వీనర్‌ కొల్లి అప్పలనాయడు ఆధ్వర్యాన టిడిపిలో చేరారు. రామభద్రపురం మండలం కోట శిర్లాం సర్పంచ్‌ తాడ్డి తిరుపతమ్మ, ఆమె భర్త శ్రీను, మరో 500 కుటుంబాలు, మాజీకౌన్సిలర్లు రెడ్డి ప్రసాద్‌, ఎ.అప్పారావు టిడిపిలో చేరారు. గొల్లపల్లి 12వ వార్డుకు చెందిన పిరిడి ఈశ్వరరావు, పిరిడి పద్మావతి, మరో 200 కుటుంబాలవారు, వేదాంత డవలపర్స్‌ అధినేత కోట సురేష్‌ చేరారు. వీరందరికి చంద్రబాబు కండువాలు వేసి ఆహ్వానించారు. బొబ్బిలి నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేస్తామని నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన అన్నారు.

➡️