.వైసిపికి రోజులు దగ్గర పడ్డాయి: మాజీ మంత్రి

Jan 7,2024 21:00

ప్రజాశక్తి- రేగిడి : రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్‌ రెడ్డి పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, అందుకు ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం పనసలవలస గ్రామ సర్పంచ్‌ గేదెల ధనలక్ష్మితో పాటు గేదెల గోవిందరావు, కడగల జోగినాయుడు, నర్సు నాయుడు, సత్యనారాయణ, గోపాలకృష్ణ, అప్పల నాయుడు, రామకృష్ణ, సింహాచలం, మంతిని సూరినాయుడు మొత్తం 700 మంది వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వీరికి కోండ్రు మురళీ పార్టీ కండువా వేసి తెదేపాలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కిమిడి అశోక్‌ కుమార్‌, మాజీ డిసిసిబి చైర్మన్‌ దూబ ధర్మారావు, కర్నేన మహేష్‌, గురవాన నారాయణరావు, మంతిన ఉషారాణి, చల్లా భుజంగరావు, మజ్జి శ్రీను, నల్ల భాస్కరరావు, గణేష్‌, పాల్గొన్నారు. డెంకాడ: మండలంలోని జొన్నాడ మాజీ ఎంపిటిసి అప్పలనాయుడు, గారి పాపు, గొలగాని గౌరీ, సంతోష్‌, గొలగాని రమేష్‌, నకెళ్ళ శ్రీను, గారి రమేష్‌, పడగల వెంకటేష్‌, పెనిమిటి అప్పన్న తదితరుల ఆదివారం వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వీరికి ఎస్‌కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లిలతకుమారి, టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జి కర్రోతు బంగార్రాజు టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర రావు, పతివాడ అప్పలనారాయణ, పల్లె భాస్కర్‌ రావు, కలిదిండి పాణిరాజు, పతివాడ శివరామ విద్య సాగర్‌ నాయుడు, త్రిపరగిరి అప్పారావు, కోరాడ రమేష్‌, సారిక నాగరాజు, త్రిపరగిరి శ్రీను, పాల్గొన్నారు.గుర్ల: టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం గూడెం గ్రామంలో జరిగిన పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో వైసిపిని వీడి 50 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి నాగార్జున పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన తోట పైడి నాయుడు, సూర్యనా రాయణ, రమణ ఆధ్వర్యంలో రెడ్డి పోలి నాయుడు, పాపారావు, జమ్ము ముసిలినాయుడు, రెడ్డి రామారావు, సువ్వాడ అప్పల నాయుడు, తోట అక్కునాయుడు, పత్తిగిల్లి శివ, రెడ్డి శ్రీను, పిల్లా శ్రీను పార్టీలో చేరాఉ. టిడిపి రాష్ట్ర బిసి సెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ వెన్నె సన్యాసినాయుడు అధ్యక్షత వహించిన టిడిపి మండల అధ్యక్షులు చనమల్ల మహేశ్వర రావు, నాయకులు తిరుములరాజు కిరణ్‌ కుమార్‌, కనిమేరక కృష్ణ, జి.రాము నాయుడు, పిల్లా అప్పలనాయుడు, నియోజకవర్గ ఐ టిడిపి అధ్యక్షులు నాగులపల్లి నారాయణరావు పాల్గొన్నారు.తెర్లాం: మండలంలోని పెరుమాలి, టెక్కలి వలస గ్రామాల నుండి 100 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. గ్రామ సర్పంచ్‌ ఎస్‌ హేమలత, భర్త అప్పల నరసింహారాజు ఆధ్వర్యంలో రెండు గ్రామాల నుండి వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్‌ బసవ వెంకటరమణ, సాగిరాజు జగన్నాథరాజు, సాగిరాజు అప్పలరాజు, వేలగాడు కృష్ణలు ఆదివారం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వెంకట నాయుడు, వెంకటేశ్వరరావు, జగ్గరాజు తదితరులు పాల్గొన్నారు

➡️