వైసిపి పాలనలో మహిళల ఆర్థికవృద్ధి

Feb 17,2024 21:35
ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
వైసిపి పాలనలో మహిళల ఆర్థికవృద్ధి
– వైఎస్‌ఆర్‌ ఆసరా విజయోత్సవ సంబరాల్లో ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో పొదుపు సంఘాల ద్వారా ప్రతీ అక్కచెల్లెమ్మలను ఆర్థికంగా స్థితిమంతులను చేశారని, ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మీ సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రయివేట్‌ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్‌ఆర్‌ ఆసరా సంబరాలు విజయోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద మహిళలందరికీ ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన పొదుపు సంఘాలు విఎఒలు, మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు తమ సేవలను ఇలగే కొనసాగించాలన్నారు. ప్రతి మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిన ఇలాంటి పొదుపు సంఘాలతో పేదరికం తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగు విడతల్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, గతంలో మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం చేయకపోవడంతో మహిళలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలియజేశారు. పొదుపు సంఘాల్లోని సభ్యులు సరిగా రుణాలు చెల్లించలేక అనేకమంది పొదుపు గ్రూపుల్లో నుంచి వెళ్లిపోవడం జరిగిందని, 18శాతం పొదుపు సంఘాలు నిర్వీర్యమైపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పొదుపు గ్రూపులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించారన్నారు. దాంతో 18 నుండి కేవలం 2 శాతానికి పడిపోయిందన్నారు. జగనన్న అందజేస్తున్న ఆర్థిక సహకారంతో ప్రతీ మహిళ తమ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకున్నారని, దాంతో రాష్ట్రంలో పేదరికం కూడా తగ్గుముఖం పట్టిందని, సంక్షేమ ప్రభుత్వం కొనసాగేందుకు మీరు కూడా ఇలగే సహకారం అందించాలన్నారు. అనంతరం మహిళలకు కానుకలను అందజేశారు. కార్యక్రమంలో జెసిఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, ఎంపిపిలు కేత వేణుగోపాల్‌ రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, సంపూర్ణమ్మ, జెడ్‌పిటిసిలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పీర్ల పార్థసారథి, రఘునాథరెడ్డి, గంగవరపు శ్రీనివాసులు నాయుడు, ఐ వి రమణారెడ్డి, నోటి వినరుకుమార్‌ రెడ్డి, రమేష్‌ రెడ్డి, సిండికేట్‌ ఫార్మర్‌ సొసైటీ చైర్మన్‌ సానా వేణుగోపాల్‌ రెడ్డి, బట్టేపాడు పిఎసి చైర్మన్‌ బొమ్మిరెడ్డి రవికుమార్‌ రెడ్డి, ఎస్‌సిసెల్‌ అధ్యక్షుడు కొండ వెంకటేశ్వర్లు, సయ్యద్‌ జమీర్‌, కొర్సిపాటి హరికిషోర్‌ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

➡️