వైసీపీలో చేరిక

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట సర్పంచ్‌ వెంకిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి పలువురు నాయకులు వైసీపీలో చేరారు. చిన్నగుడిపాడు నుంచి సైతం కొందరు చేరారు. వారందరికీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందా లంటే తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేసి తిరిగి ముఖ్యమంత్రిగా జగనన్నను చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్నా కాశిరెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, వెన్నా కాశీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️