వ్యవసాయ స్టార్టప్‌ను ప్రోత్సహించాలి

Jan 29,2024 20:53

ప్రజాశక్తి- డెంకాడ  : వ్యవసాయ స్టార్టప్స్‌ ప్రోత్సహించాలని పల్సస్‌ సిఇఒ గేదెల శ్రీనుబాబు అన్నారు. లెండి కళాశాలలో ఇన్నోవేషన్‌ ఇంక్యూబేషన్‌ సెల్‌, ఎంట్రెప్రేనూర్షిప్‌ డెవలప్మెంట్‌ సెల్‌ సంయుక్తంగా ప్రోసోస్‌ ఆఫ్‌ ఇన్‌వేషన్‌ డవలప్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ రెడీనెస్‌ లెవెల్‌ అనే అంశంపై సోమవారం నిపుణుల ప్రసంగించారు.ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో వనరులను ఉపయోగించి ఉత్తమ ఆంధ్రగా మారటానికి విధ్యార్థులు స్టార్టప్స్‌ నెలకొల్పాలని సూచించారు. స్థానిక సమస్యలను స్థానిక వనరులను, టెక్నాలజీ, స్థానిక స్టార్టప్స్‌ ద్వారానే సమర్ధ వంతంగా పరిష్కరించ వచ్చునని తెలిపారు. ఎయు సెలక్టర్‌ కవిత సిరుగుడి, బొసియా డైరెక్టర్‌ బావిశెట్టి కిరణ్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడుతూ కెరీర్‌, గోల్‌, అభిరుచులను తెలుసుకొని, సమాజాభివృద్ధికి దోహద పడాలని విద్యార్థులకు హితవు పలికారు. కళాశాల ప్రిన్సిపల్‌ వివి. రామరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత స్టార్టప్స్‌ని నెలకొల్పటంతో వారి ప్రాంతానికి పలుమందికి ఉపాదిని అందించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఇన్నోవేషన్‌, ఇంక్యూబేషన్‌ సెల్‌ నిర్వాహకులు డాక్టర్‌ ఎ.వి. పరాంకుశం, ఎంట్రెప్రన్యూర్ష్రిప్‌ సెల్‌ నిర్వాహకులు డాక్టర్‌ పి.తిరుమల, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వర ప్రసాద్‌, డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డాక్టర్‌ టి.హరిబాబు, పలు విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️