శ్రీ మెడికల్‌ రిప్స్‌ సమ్మె విజయవంతం

మెడికల్‌ రిప్స్‌ సమ్మె

రాజమహేంద్రవరం ప్రతినిధి ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రెసెంటేటివ్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రెసెంటేటివ్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు కోట గుమ్మం సెంటర్‌లో సమ్మె చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సత్తిరాజు మాట్లా డుతూ దేశావ్యాప్తంగా ఉన్న సేల్స్‌ ప్రమో షన్‌ ఎంప్లాయీస్‌ అందరికీ ఎప్‌పిఇ యాక్ట్‌ 1976 వర్తింపజేయాలని, రిప్రెసెంటేటివ్స్‌ చేసే విధి విధానాలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పిఫైజర్‌ యూనియన్‌ నాయకులు సబ్బం కృష్ణ మాట్లాడుతూ, మందుల ధరలు తగ్గించాలని, మందులు, మెడికల్‌ ఉపకారణాలపై జిఎస్‌టి ఎత్తివేసి ప్రజలకు మందులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేసారు. ఎల్‌ఐసి జాతీయ నాయకులు పి.సతీస్‌, నాయకులు రాజుగారు, సత్య దేవ్‌, రాజమండ్రి హోల్‌సేల్‌ అసోసియేషన్‌, కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఎక్కల నాగేశ్వరరావు, స్వర్ణాంధ్ర సేవాసంస్థ ఫౌండర్‌ గుబ్బల రాంబాబు, సిఐటియు నాయకులు పవన్‌ పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అనంతరం సమ్మె సెంటర్‌ నుంచి రంగ్రీజ్‌ పేట, వాటర్‌ వర్క్స్‌ వీధి, పప్పులవీధి మీదుగా మెయిన్‌ రోడ్డు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ ఆందోళనలో గోపాల్‌, రణదీప్‌ సింగ్‌, దానేశ్వరరావు, రామకృష్ణ, రామ్‌కుమార్‌, సత్యనారాయణ, చందు పాల్గొన్నారు.

➡️