శ్రీ వేతన సవరణ కోసం ఎల్‌ఐసి ఉద్యోగులు

వేతన సవరణ కోసం ఎల్‌ఐసి ఉద్యోగులు

రాజమహేంద్రవరం ప్రతినిధి వేతన సవరణ కోసం తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు స్థానిక డివిజనల్‌ కార్యాలయం వద్ద బుధవారం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద్భంగా జోనల్‌ అధ్యక్షుడు పి.సతీష్‌, డివిజనల్‌ అధ్యక్షుడు గుబ్బల రాంబాబు మాట్లాడారు. ఎల్‌ఐసి ఉద్యోగుల డిమాండ్ల సాధనకు టోకెన్‌ సమ్మెకు జనవరి 10, 2024న ఒక గంట జాయింట్‌ ఫ్రంట్‌ పిలుపు నిచ్చిందన్నారు. అప్పటికీ స్పందన లేకుంటే తర్వాత ఉదతంగా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.అశోక్‌, డి.వీర కిషోర్‌, సత్యదేవ, మాథ్యూస్‌, శిరీష, జి.శ్రీనివాస్‌, విశ్వనాథ్‌, బి.శ్రీనివాసరావు, ఎస్‌.గన్నెయ్య, పట్నాయక్‌, దొరబాబు, పిఎస్‌ఎన్‌.రాజు, పి.సాయిబాబా, షఫీద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️