షష్టి వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

ముదినేపల్లి : మండలంలోని సింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్‌లో ఉన్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న షష్టి కళ్యాణ మహోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు శనివారం ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ నుంచి షష్టి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ ఇఒ సంధ్య, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కైకలూరులోని డిఎన్‌ఆర్‌ను ఆయన స్వగృహంలో కలిసి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

➡️