షోకాజ్‌ నోటీసుల దహనం

Jan 9,2024 00:06
సమగ్ర శిక్ష ఉద్యోగులకు

ప్రజాశక్తి – కాకినాడ

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులను ఉద్యోగులు దహనం చేశారు. స్థానిక డిఇఒ కార్యా లయం వద్ద ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు సోమ వారం నిరసన దీక్షను చేపట్టారు. అ సంద ర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన నోటీసుల ప్రతులను దహనం చేశారు. ఈ సంద ర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లా డుతూ ఈ నెల 5న ఎస్‌పిడి కార్యాలయం ము ట్టడి సందర్భంగా చర్చలకు పిలిచిన అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని, చర్చలకు పిలిచిన అధికారులే సోమవారం తమకు నోటీసులు ఇచ్చారని తెలి పారు. ఈ నోటీసుల ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని అన్నారు. ఈ తాటాకు చప్పుళ్ళకు, నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులును రెగ్యులర్‌ చేయమంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం జగన్‌ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జెఎసి జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఎం.చంటి బాబు, సత్యనాగమణి, నాయకులు ఎంవి.సాయి కిరణ్‌, ఎ.లోవరాజు, నాయకత్వం వహించారు.

➡️