సంక్రాంతి వచ్చినా అందని రేషన్‌

Jan 13,2024 20:48

 ప్రజాశక్తి-బాడంగి :  ఎరుకులపాకలు గ్రామంలో ఈ నెల రేషన్‌ ఇప్పటికీ పంపిణీ చేయలేదు. రేషన్‌ పంపిణీ వాహనం కోసం ఆ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పండగ సమీపించినా రేషన్‌ బియ్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రతి సంక్రాంతికీ చంద్రన్న కానుక పేరుతో బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేవారని, వైసిపి అధికారంలోకి వచ్చాక బియ్యం కూడా సరిగా పంపిణీ చేయడం లేదని టిడిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపిటిసి సభ్యులు పాలవలస గౌరు తెలిపారు. అధికారులు స్పందించి ప్రతి నెలా మొదటి వారంలో రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని కోరారు.

➡️