సంక్షేమ పథకాలపై అవగాహన

Jan 13,2024 21:43
బహుమతులు అందజేస్తున్న చెన్నుడు

బహుమతులు అందజేస్తున్న చెన్నుడు
సంక్షేమ పథకాలపై అవగాహన
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ చెన్నుడు అధికారులకు సూచించారు. వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా స్థానిక 35వ డివిజన్‌ పొదలకూరు రోడ్డులోను,16వ వార్డు స్థానిక చిల్డ్రెన్స్‌ పార్కు వద్ద ఆంజనేయస్వామి ఆలయం మందిరం వద్ద కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచార వాహనం, శిబిరాల ద్వారా అవగాహనా క్యాంపులను శనివారం నిర్వహించారు. క్యాంపులలో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, అవగాహన, అర్హులైన వారికి రిజిస్ట్రేషన్‌, ఆధార్‌ అప్డేట్‌, పి.ఎం స్వనిధి పథకం, ముద్ర లోన్‌, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించామని తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమ వ్యక్తిగత అనుభవాలను క్యాంపుల ద్వారా పంచుకున్నారని వెల్లడించారు. స్వాగత, ఉత్సవ కమిటీ, కల్చరల్‌ కమిటీలను ఏర్పాటు చేసి ఆయా బందాల ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ వరకు నగర పాలక సంస్థ పరిధిలో 8 ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై పరిపూర్ణమైన అవగాహన కల్పించి, అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కార్యక్రమంలో సంకల్ప యాత్ర కన్వీనర్లు రాధా కష్ణ గౌడ్‌, రవి శంకర్‌, అశోక్‌, రాజేశ్వరి, స్థానిక వైసిపి నాయకులు యాకసిరి శరత్‌ చంద్ర, సెక్రటరీ హేమావతి, ఇంజినీరింగ్‌ ఏ.ఈ చాణక్య, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

➡️