సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి 

Dec 4,2023 20:49

ప్రజాశక్తి – వంగర  :  మండలంలోని సంగాంలో గల సంగమేశ్వర ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని స్పీకరు తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన కుటుంబ సమేతంగా సంగమేశ్వర ఆలయాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సిద్ధాంతం గణపతితో పాటు చైర్మన్‌ బోను నాగరాజు, వైసిపి నాయకులు గేదెల రామకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని విలేకర్లతో మాట్లాడుతూ ద్వాపర యుగం నుంచి ఈ ఆలయానికి యాత్రికుల తాకిడి భారీగా ఉండటం గొప్ప విషయమన్నారు. అలాంటి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ డి. ఐజాక్‌, ఆర్‌ఐ జామి మురళి తదితరులు పాల్గొన్నారు.

➡️