సంఘీబావ సభ జయప్రదం చేయాలి

Mar 4,2024 21:21

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సంఘీబావ సభను జయప్రదం చేయాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూని యన్‌ అధ్యక్షులు టి. వి. రమణ పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మి కులు న్యాయమైన సమస్యలు పరిష్కరి ంచాలని కోరుతూ చేస్తున్న నిరశన శిబిరం 33వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా టి.వి రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ నిరశన శిబిరంలో మాట్లాడుతూ నెలలు గడుస్తున్న మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించక పోవడంతో ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో మంగళ వారం సంఘీబావ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు మిమ్స్‌ ఉద్యోగులు, కార్మి కులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పలికి సంఘీబావ సభను జయ ప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు ఎం.నారాయణ, కె.కామునాయుడు, ఎం. నాగభూషణం, కొమ్మూరి మధు, రాంబాబు, అప్పలనాయుడు, గౌరి, బంగారు నాయుడు, మూర్తి పాల్గొన్నారు

➡️