సంతప్త స్థాయిలో సంక్షేమ పథకాలు : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప జిల్లాలో సంతప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి జగమన్న హౌసింగ్‌ పట్టాల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అసైన్డ్‌, చుక్కల భూములు, మూడవ దశ రీ సర్వే, పంచాయతీ రాజ్‌ ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ (నరెగా), రబీ పంటలు, తాగునీరు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి సంబంధిత కార్యదర్శులతో కలిస అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుండి నుంచి కలెక్టర్‌తోపాటు జెసి, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష హాజరయారు. విసి ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సూచనలు, ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు.. ప్రజలకు సంతప్తి స్థాయిలో అందా లని, అధికారులను ఆదేశించారు .జిల్లాలో మూడవ దశ రీ సర్వేను పకడ్బందీగా ఎక్కడ పెండింగ్‌ లేకుండా స్టోన్‌ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద జిల్లాలోని అన్ని హౌస్‌ హాల్డ్స్‌కు కొళాయి కనెక్షన్‌ అందించామన్నారు. వివిధ అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు కషి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ యదు భూషణ్‌ రెడ్డి, డిఎంహెచ్‌ఒ నాగరాజు, సిపిఒ వెంకటరావు, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️