సచివాలయాల్లో ఎంపిడిఒ పరిశీలన

Jan 3,2024 21:44
ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌
సచివాలయాల్లో ఎంపిడిఒ పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని మహిమలూరు, రామస్వామిపల్లి, చెర్లోఎడవల్లి సచివాలయాల్లో బుధవారం ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ పరిశీలించారు. 19వ తేదీన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ స్వరాజ్‌ మైదాన్‌, విజయవాడలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 8వ తేదీన మండలంలోని అన్ని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి వారి విగ్రహాల దగ్గర రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను ఆహ్వానించి ఈ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్‌ చిత్రపటాలను పూలమాలలతో అలంకరించి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అన్ని స్కూళ్లు కాలేజీలలో విద్యాశాఖ తరఫున విద్యార్థులకు డ్రాయింగ్‌, వ్యాసరచన, క్విజ్‌ మొదలైన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. 9వ తేదీన మండలం, డివిజన్‌, జిల్లా స్థాయిలలో ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన మేధావులను, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జీవిత చరిత్ర, సోషల్‌ జస్టిస్‌ అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించాలన్నారు. ప్రత్యేక బ్యానర్‌ ఏర్పాటు చేసి సంతకాల సేకరణ జరపాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, 10వ తేదీన డివిజనల్‌ స్థాయిలో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు చేపట్టాలన్నారు. 12వ తేదీన మానవహారం నిర్వహించి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలు ఉన్న కూడళ్లలో కళాప్రదర్శనలు చేపట్టాలన్నారు. అదేవిధంగా 19వ తేదీ విజయవాడలో జరుగునున్న కార్యక్రమానికి సచివాలయం నుండి ఐదుగురు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. సచివాలయాల స్థాయిలలో జరగాల్సిన అన్ని కార్యక్రమాల గురించి ముందస్తుగా అవగాహన కల్పించి విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఆయనవెంట పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్‌లు పాల్గొన్నారు.

➡️