సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం

Jan 25,2024 21:02

 ప్రజాశక్తి – గరుగుబిల్లి :  గ్రామసచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని సంతోషపురంలో గ్రామసచివాలయ భవనంతో పాటు రైతుభరోసా కేంద్రం, పెద్దూరులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అలాగే ఉద్దవోలులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ సెంటర్‌లను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా పనులు జరుగుతున్నాయన్నారు. ఎంపిపి, జెడ్పీ వైస్‌చైర్మన్‌ ఉరిటి రామారావు, మరిశర్ల బాపూజీ నాయుడు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి ద్వారపురెడ్డి ధనంజయరావు, వైసిపి నాయకులు అంబటి గౌరునాయుడు, అక్కేన రామకృష్ణ, ఎంపిడిఒ జి.పైడితల్లి, మండల ఇంజనీరింగ్‌ అధికారి గోపి గౌరీశంకర్రావు, ఎఒ రేగిడి విజయభారతి, తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ముంగిటికే ఎనలేని సేవలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని కృష్ణపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ, ఆర్‌బికె, వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిటికే సేవలు చేరువయ్యాయన్నారు. ప్రజలు వైఎస్‌ జగన్‌ పరిపాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డిఇ డి.రత్నకుమార్‌, జెఇ చంద్రమౌళి, ఎంపిపి శోభారాణి, జెడ్పిటిసి రేవతమ్మ, నాయకులు మజ్జి చంద్రశేఖర్‌, బొమ్మి రమేష్‌, బలగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : మండలంలోని ఆర్‌.వెంకంపేటలో రూ.25లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చెంతకు తెచ్చి సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో వందల మీటర్లు సిసి కాలువలు, రోడ్లుతో పాటు నాడు నేడు ద్వారా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే గ్రామంలో ఇంటి ఇంటికీ కుళాయిలు ద్వారా తాగు నీరు అందజేస్తున్నామన్నారు. కార్యకక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, మండల వైసిపి అధ్యక్షులు బొంగు చిట్టి రాజు, వైస్‌ ఎంపిపి టి.సూర్యనారాయణ, సర్పంచ్‌ పెంట శ్రీదేవి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️