సడలని సంకల్పం

Jan 9,2024 21:34

ఎస్మా ప్రయోగించినా…అరెస్టులు చేసినా..ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించినా మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు తమ పోరాటాన్ని సాగిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన చేపట్టిన సమ్మె నెలరోజులుకు చేరుకుంటున్నా సడలని సంకల్పంతో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా బెదిరించిన, సమ్మెను నిషేధిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా వారంతా అదర లేదు..బెదరలేదు. తమ సమస్యలు పరిష్కరించేవరకు పోరాడుతామని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.

పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ 29వ రోజు సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు మంగళవారం కొనసాగాయి. నిరాహార దీక్షలో పాల్గొన్న పాలకొండ, భామిని, సీతానగరం మండలాలకు చెందిన నాయకులకు మద్దతుగా అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు పి.సరళారాణి, గంట జ్యోతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర పాల్గొన్నారు. ఈ జరిగిన దీక్షల్లో భద్రగిరి, బలిజిపేట మండల సెక్టార్ల అంగన్వాడీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుల హేమ ప్రభ, ధర్మవతి, గౌరీశ్వరి, గౌరీమణి, ఇందిర, శ్రీదేవి పాల్గొన్నారు.కురుపాం : అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి మంగళవారంతో 29వ రోజుకు చేరుకున్న స్థానిక పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న దీక్ష శిబిరం వద్ద సాష్టాంగ నమస్కారంతో వినూన్నత రీతిలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ మాట్లాడుతూ అంగన్వాడీల హక్కులపై శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి అనవసరమైన రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో కురుపాం, జియ్యమ్మవలస మండలాల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.గరుగుబిల్లి : అంగన్వాడీల సమ్మె 29వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో మండల కేంద్రంలో మంగళవారం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సదర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ గౌరమ్మ, ఎం సావిత్రి, కృష్ణవేణి, లక్ష్మి, అచ్చియ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీ చేపట్టిన ధర్నా మంగళవారం నాటికి 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు జగన్‌కు దండాలు పెడుతూ జగనన్న గోవిందా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ సంఘం నాయకులు వి.రామలక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, వ్యవసాయ కార్మికసంఘం, అంగన్వాడీ నాయకులు మడక సత్యవతి, యశోద, అరుణ, పద్మ, రెడ్డి లక్ష్మితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.సాలూరు: అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేపట్టిన సమ్మె 29రోజుకి చేరింది. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తిరుపతమ్మ పార్వతి శశికళ సుజాత పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. పోర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కే గౌరీశ్వరరావు, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.కొమరాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె నిర్మించే ప్రసక్తి లేదని యూనియన్‌ నాయకులు అనురాధ తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 29వ రోజు మంగళవారం కొనసాగింది. ఇప్పటికే గడిచిన అనేక రోజులుగా సమ్మెలు చేస్తున్నప్పటికీ కూడా తూతూ మంత్రంగా చర్చలు తప్ప సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకపోవడం చాలా అన్యాయం అన్నారు. కక్ష సాధింపు చర్యలు మానుకొని వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరారు.వంటా వార్పుతో రాత్రి బస సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట 29వ రోజు నిరవధిక సమ్మె సందర్భంగా అంగన్వాడీలు ప్రభుత్వ మొండివైఖరిపైన నిద్రించి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు శిబిరంలో డి.రమణారావు మాట్లాడుతూ ఈనెల 11నుంచి సిఎం ఆఫీసు వద్ద ఆమరనిరాహార దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శిమి సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్‌, ఎం.కాంతారావు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.పాలకొండ: అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌హొయూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె కొనసాగుతుంది. తమసమస్యలు పరిష్కరించకుంటే తెలంగాణలో కెసిఆర్‌ ప్రభు త్వానికి పట్టిన గతే జగన్మోహన్‌ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమం లో యూనియన్‌ జిల్లా కోశాధికారి బి.అమరవేణి, నాయకులు జెస్సీబాయి, జి.శారద, లలిత, దివ్య, నిర్మల, భవా, శ్రీదేవి, మణి తదితరులు పాల్గొన్నారు.ఇవీ డిమాండ్లు్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ్క ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణా కన్న అదనంగా వేతనాలు పెంచాలి్క సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. ్క మినీ సెంటర్లను తక్షణమే మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.్క రిటైర్మెంట్‌ బెపిఫిట్‌ 5 లక్షలకు పెంచాలి. ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్‌ ఇవ్వాలి.్క హెల్పర్ల ప్రమోషన్లో నిర్ధిష్టమైన నిబంధనలు రూపొందించాలి. రాజకీయజోక్యం అరికట్టాలి.్క సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రూ.10 లక్షలు బీమా అమలు చెయ్యాలి.్క వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలి్క లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎస్‌ఆర్‌ఎస్‌ రద్దు చెయ్యాలి. ప్రీస్కూల్‌ బలోపేతం చెయ్యాలి. ్క ఎస్‌ఆర్‌ఎస్‌, వివిధ రకాల యాప్‌ లను రద్దు చేసి ఒక యాప్‌ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలి.్క వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి.్క పెండింగ్లో ఉన్న సెంటర్‌ అద్దెలు, 2017 నుండి టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి.్క పెండింగ్‌లో ఉన్న గ్రేడ్‌ 2 సూపర్‌వైజర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

➡️