సమగ్ర శిక్ష ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు

Dec 27,2023 23:25
సమగ్ర శిక్ష ఉద్యోగుల

పజాశక్తి – కాకినాడ

సమగ్ర శిక్ష ఉద్యోగుల సహ నాన్ని పరీక్షిం చవద్దని యూనియన్‌ జెఎసి అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చంటిబాబు, సత్య నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్య దర్శి చెక్కల రాజ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. డిఇఒ కార్యాలయం వద్ద జరుగు తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష బుధవారం నాటికి 8వరోజుకు చేరింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇన్‌ఛార్జ్‌ డిఇఒ జి.నాగమణి, కలెక్టర్‌ కృతికా శుక్లాకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్‌, చత్తీస్‌ ఘడ్‌, ఒరిస్సా రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖలో పనిచేసే సమగ్రశిక్షా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులం దరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పార్ట్‌ టైం విధా నాన్ని రద్దుచేసి మినిమం టైంస్కేల్‌ ప్రకారం వేత నాలను చెల్లించాలని కోరారు. సర్వశిక్ష అభియాన్‌ నిర్వ హణ కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం బడ్జెట్‌ కేటాయించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభు త్వం ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులను సైతం జగన్‌ ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే తమకు నాలుగు నెలలుగా వేతనాలు లేకుండా పోయాయని అన్నారు. 2014 ముందు పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్‌ చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో 2005 నుంచి పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు లేరని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా సమగ్రశిక్షలో పనిచేసే 25 వేల మంది ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఎ.లోవరాజు, సహాయ కార్యదర్సులు జి.నారాయణ, శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్‌, రాధాకృష్ణ నాయకత్వం వహించారు.

➡️