సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 13,2023 00:08
సమ్మెలో భాగంగా

ప్రజాశక్తి – యంత్రాంగం

రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలోని అన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. కాకినాడ ఇంద్రపాలెం లాకులు వద్ద కాకినాడ అర్బన్‌, రూరల్‌, పెదపూడి, కరప మండలాలకు సంబంధించిన అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో సమ్మె శిబిరానికి చేరుకున్నారు. ఈ సమ్మె శిబిరాన్ని ఎపి అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాల నుంచి తహశీల్దార్‌ కార్యాలయాల నుంచి ఎంఎల్‌ఎలు, మంత్రులకు అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అంగన్‌వాడీలు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు. తమ డిమాండ్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ శిబిరంలో పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమణి, మధ్యాహ్నం భోజనం వర్కర్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.ఈశ్వరి సంఘీ భావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రాజెక్టు అధ్యక్షురాలు నీరజ కార్యదర్శి జ్యోతి, జిల్లా కోశా ధికారి రమణమ్మ, రాజేశ్వరి, భాం దవి, కాకినాడ రూరల్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరవేణి, కార్యదర్శి వీరమని, వరలక్ష్మి, రామా తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం స్థానిక ఐసి డిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 283 సెంటర్లను మూసి వేసి అంగన్‌వాడీ కార్య కర్తలు, ఆయాలు సమ్మె లోకి దిగారు. స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్‌ అధ్య క్షులు దాడి బేబీ మాట్లా డుతూ ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదన్నారు. సమ్మె విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి.నాగమణి, అమల, ఎస్తేరురాణి, ఫాతిమా, పద్మ, సూర్య కుమారి, కాలే దేవి, అన్నపూర్ణ, లక్ష్మి, సావిత్రి, దేవి, సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. అంగ న్‌వాడీల సమ్మెకు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కెఎస్‌.శ్రీని వాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి.ఈశ్వ రరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్య దర్శి వళ్లు రాజబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పితాని బాలకృష్ణ, అత్తిలి బాబురావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కృష్ణవేణి, అనంతలక్ష్మి, వరలక్ష్మీ, సత్య, అన్నవరం, పద్మజ పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ, యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి.సాయిరామ్‌, జిల్లా కార్యదర్శి పివివి.సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాలకు చెందిన అంగన్‌వాడీలు పాల్గొన్నారు. రౌతులపూడి అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నుంచి ప్రారంభమైన సమ్మెలో భాగంగా మండలానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు శంఖవరంలో జరిగే ధర్నాకు తరలివెళ్లారు. పిఠాపురం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.పద్మ, ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి తులసి మాట్లాడారు. అంగన్‌వాడీల ధర్నాకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూని యన్‌ నాయకులు విజయ శాంత, ప్రజావాణి, జి.బేబీరాణి, డి.బేబీ, కమలా రాణి పాల్గొన్నారు.

➡️