సమస్యల పరిష్కారానికి ఆశాల వినతి

Dec 26,2023 20:40
ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న ఆశా వర్కర్లు

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న ఆశా వర్కర్లు
సమస్యల పరిష్కారానికి ఆశాల వినతి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం తహశీల్దారు కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్స్‌ కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్డ్‌మెంట్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలుచేయాలనీ, ఆశా నియామకాల్లో రాజకీయ జోర్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని, రిటైర్మెంట్‌ కాలాన్ని 62యేళ్లకు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనెఫిట్స్‌ కల్పించిన తర్వాతే రిటైర్మెంట్‌ చేయాలని కోరారు. గత 18 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం మా సేవలను గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎఎన్‌ఎం హెల్త్‌ సెక్రటరీల నియామకంలో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వసుంధర, గాయత్రి, కళ్యాణి, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, సుమతి, సుమ, నాగేంద్ర, రోజా, సుహాసిని, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️