సమైక్యంగా ఉద్యమిద్దాం

ప్రజాశక్తి – మార్కాపురం : సమాజంలో నేటికీ కొనసాగుతున్న సనాతన సాంప్ర దాయాలపై సమైక్యంగా ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా స్థానిక భగత్‌ సింగ్‌ నగర్‌ లో ఆదివారం సభ నిర్వహించారు. సభలో ఆమె మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన స్త్రీని అనగదొక్కే భావజాలం సనాతనమైనదని తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితమై, మగవారికి సేవ చేసుకునే వారిగా ఉండాలని సనాతన సాంప్రదాయం బోధిస్తుందన్నారు. సంఘసంస్కర్తలు, ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయవాదులు నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా సనాతన సాంప్రదాయాలకు కొంత మేరకు సమాధి కట్టగలినట్లు తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి తిరిగి విజంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మార్కాపురం పట్టణ కార్యదర్శి డి.శారా, ఐద్వా నాయకులు సిహెచ్‌ .ప్రమీల, జువ్వాజి మార్తమ్మ, ఎం. యోహానమ్మ , కె.రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️