సమ్మె మరింత ఉధృతం

Dec 16,2023 20:56

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  బలవంతంగా కేంద్రాలను తెరచి, అంగన్వాడీ కేంద్రాలను నడపడితే, తదనంతరం పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి ప్రశ్నించారు. ఎన్నికల ముందు సిఎం ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చేపట్టిన నిరవధిక సమ్మె ఐదో రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు కార్యకర్తలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలు తెలియజేశారు. అనంతరం స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావుకు మేరకు వినతి అందించారు. సమ్మెకు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకట రమణ, బంకురు సూరిబాబు మద్దతు తెలిపారు.

సాలూరు: తమ డిమాండ్లు ఆమోదించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్వైనాయుడు, బి.రాధ స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎర్ర చీరలు కట్టుకొని నోటికి నల్లరిబ్బన్లతో నిరసన వ్యక్తం తెలిపారు. తొలుత ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమం లో యూనియన్‌ నాయకులు శ్యామల, నారాయణ మ్మ, శశికళ, వరలక్ష్మి పాల్గొన్నారు.

కొమరాడ : అంగన్‌వాడీలు ఎరుపు చీరలు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఐసిడిఎస్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. తొలుత అంతరాష్ట్ర రహదారిపై బిక్షాటన చేస్తూ విన్నత రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులతో పాటు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి నిరసనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. సమ్మెకు టిడిపి నాయకులు బిడ్డికి తమ్మయ్య, మరడాన వెంకట నాయుడు. బత్తిలి శ్రీనుమద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీగా అంగన్వాడీలు పాల్గొన్నారు.

గరుగుబిల్లి: అంగన్వాడీల సమ్మెలో భాగంగా ఎరుపురంగు చీరలు కట్టుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బంటు దాసు, కరణం రవీంద్ర,హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ గౌరమ్మ, ఎం.సరస్వతి పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

మక్కువ : అంగన్‌వాడీల దీక్షా శిబిరాన్ని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి సందర్శించి సంఘీభావం తెలిపారు. తొలుత గిరిజన సంఘం మండల నాయకులు టి.ప్రభాకర్‌, అంగన్వాడీసంఘం మండల నాయకులు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడుతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ సాబ్జీకి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ మండల నాయకులు పద్మ, సుశీల, సీతమ్మ, గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

బలిజిపేట: మండలంలోని అంగన్‌వాడీలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ నల్ల బ్యాడ్జీలు కొట్టుకొని మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడుతూ అంగన్వాడి సమస్యలు పరిష్కార సాధనకై ఎంతవరకైనా వెళ్తామని ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వంజరాపు సత్యం నాయుడు అంగన్వాడి హెల్పర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాలకొండ : అంగనవాడీల సమ్మెలో భాగంగా స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ఎర్రచీరలు ధరించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి హిమప్రభ, ప్రాజెక్టు అధ్యక్ష కార్యాదర్శలు జెస్సిభారు, అమరవేణి మాట్లాడుతూ ప్రభుత్వం అంగనవాడీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు.

పాచిపెంట : అంగన్వాడీ ప్రాజెక్ట్‌ నాయకులు టి.ప్రభావతి ఆధ్వర్యాన మోకాళ్లపై నిల్చొని, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర మాట్లాడుతూ అంగన్వాడీలపై వేధింపులకు పాల్పడితే భవిష్యత్తు పోరాటానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. వీరి పోరాటానికి సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, చింత పోలిరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ నాయకులు రమా, పార్వతి, మోసూరు రమణమ్మ, సరోజిని, సాయి, పూజ, ఎం.చిన్నమ్మి తదితరులు పాల్గొన్నారు.

సీతంపేట : స్థానిక ఐటిడిఎ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ఎరుపురంగు (చీరలతో,) నిరసన తెలిపారు. తొలుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.సురేష్‌, ఎం.కాంతారావు, తదితర అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్‌ నిమ్మక జయకృష్ణ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, భవిష్యత్తు గ్యారెంటీ ప్రచారకర్త తోయిక సంధ్యారాణి,బీసీ సెల్‌ అధ్యక్షులు ఆర్‌ రంగనాథం, ఐటిడిపి కోఆర్డినేటర్‌ ఇమరక పవన, యూనిట్‌ ఇంచార్జ్‌ బిడ్డీక ప్రవీణ్‌ సాయి మరియు నియోజకవర్గ నాయుకులు పాల్గొన్నారు.కురుపాం : స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపాన జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు వద్దకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, గిరిజన సంఘం నాయకులు ఎం. రమణ సంఘీభావం తెలుపుతూ శుక్రవారం రోడ్డుప్రమాదం లో మృతి చెందిన ఎమ్మెల్సీ సాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు, ఎంపిడిఒ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.శ్రీనివాసరావు, టిడిపి మండల నాయకులు ఆరిక విప్లవ కుమార్‌, అంగన్వాడి వర్కర్స్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ, సెక్టార్ల లీడర్లు, వర్కర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం : అంగన్వాడీల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎరుపు చీరలు ధరించి, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు సత్యవతి, కస్తూరి ఉన్నారు.కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతుఅంగన్వాడీలు చేసమ్మె మరింత ఉధృతంప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌బలవంతంగా కేంద్రాలను తెరచి, అంగన్వాడీ కేంద్రాలను నడపడితే, తదనంతరం పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి ప్రశ్నించారు. ఎన్నికల ముందు సిఎం ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ చేపట్టిన నిరవధిక సమ్మె ఐదో రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు కార్యకర్తలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలు తెలియజేశారు. అనంతరం స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావుకు మేరకు వినతి అందించారు. సమ్మెకు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకట రమణ, బంకురు సూరిబాబు మద్దతు తెలిపారు.సాలూరు: తమ డిమాండ్లు ఆమోదించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్వైనాయుడు, బి.రాధ స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎర్ర చీరలు కట్టుకొని నోటికి నల్లరిబ్బన్లతో నిరసన వ్యక్తం తెలిపారు. తొలుత ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమం లో యూనియన్‌ నాయకులు శ్యామల, నారాయణ మ్మ, శశికళ, వరలక్ష్మి పాల్గొన్నారు.

 

➡️