సమ్మె శిబిరంలో అంగన్వాడీల ప్రతిజ్ఞ

Jan 22,2024 00:39

తెనాలి శిబిరంలో ప్రతిజ్ఞ చేస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : ప్రభుత్వం, అధికారులు ఎంత బెదిరించినా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తాము మాత్రం సమ్మె విరమించబోమని అంగన్వాడీలు శపథం చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి, రాష్ట్ర నాయకత్వం ప్రకటించే వరకూ ఐక్యంగా ఉద్యమిస్తామని ఆదివారం తెనాలి సమ్మె శిబిరంలో ప్రతిజ్ఞ చేశారు. స్థానిక స్థానిక విఎస్‌స్సార్‌ అండ్‌ ఎన్‌విఆర్‌ కాలేజీ ఎదుట నిర్వహిస్తున్న సమ్మె శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న నాయకుల ఆరోగ్యం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు. అనారోగ్యానికి గురైన నాయకులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిబిరంలో ప్రతిజ్ఞ చేశారు. యూనియన్‌ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, భ్రమలకు, నిర్బంధాలుకు వత్తిళ్లకు లోంగభోమని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం నాయకులు షేక్‌ హుస్సేన్‌వలి, కె.బాబుప్రసాద్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎవిఎన్‌ కుమారి, తెనాలి అధ్యక్షులు అనూరాధ, పి.పావని, నళిని, జయలక్ష్మి, సీత, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి, జానకి, రాధిక, శాంత కుమారి, పుష్పలత, పర్వీన్‌, చంద్రిక, పర్వీన్‌, శైదా, ఆదిలక్ష్మి, స్వర్ణ, శ్రీదేవి పాల్గొన్నారు.
ప్రజాశక్తి- పెదనందిపాడు రూరల్‌ : సమ్మె శిబిరం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు వీధులను ఉడ్చి నిరసన తెలిపారు. యూనియన్‌ మండల సంఘ అధ్యక్ష కార్యదర్శులు శివపార్వతి శ్రీదేవి, అంగన్బాడీలు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా సోమవారం సిఎం ఇల్లు ముట్టడిలో పాల్గొన రాదంటూ ఆదివారం రాత్రి పెదనందిపాడులో అంగన్వాడీ, ప్రజా సంఘాల నాయకులైన శివపార్వతి, శ్రీదేవి, వెంకటశివ, వెంకట సుబ్బారావుకు ఎఎస్‌ఐ శ్రీనివాసరావు నోటీసులు ఇచ్చారు.
ప్రజాశక్తి – పెదకాకాని రూరల్‌ : స్థానిక ప్రధాన సెంటర్లో అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడారు. యూనియన్‌ అధ్యక్షులు గోపి, మల్లారెడ్డి, పూర్ణరెడ్డి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : అంగన్‌వాడీలు సమ్మె 41వ రోజుకు చేరుకుంది. మరింత పట్టుదలగా సమ్మెలో పాల్గొంటున్నారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి.దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు సార్లు చర్చలకు పిలిచి ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు జీతాల పెంపుదల మీద నిర్ణయం ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌కె ఫాతిమ, తబిత, మాణిక్యం, కిరణ్మయి, జసంత, సుజాత, నాగలక్ష్మి, శ్రీదేవి, ఆశ్విని పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తాడికొండ : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. విధుల్లో చేరాలంటూ అధికారులు ఒత్తిడి పెడుతున్నారని, అయినా తాము సమ్మెను విరమించ బోమని అంగన్వాడీలు ఉద్ఘాటించారు. నాయకులు విజయదుర్గ, రాజకుమారి, ప్రేమకుమారి, శంషాద్‌, సామ్రాజ్యం, రైతు సంఘం, సిఐటియు నాయకులు గాంధీ రామ్మోహనరావు, భాస్కరరావు, పాల్గొన్నారు.
ప్రజాశక్తి – పొన్నూరు రూరల్‌ : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు మండల కార్యదర్శి ఎన్‌.రమేష్‌బాబు మాట్లాడారు. ఎంవి సుకన్య, హైమావతి, రామలక్ష్మి, సుజాత, ఆదిలక్ష్మి, దుర్గ పాల్గొన్నారు.

➡️