సిఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

సిఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

ప్రజాశక్తి-కాకినాడ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి కాకినాడ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ పటిష్టవంతంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన సిఎం సభ జరగనున్న ఆర్‌ఎంసి గ్రౌండ్‌ ఆవరణను వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పెషలాఫీసర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ సభా వేదిక వద్ద పారిశుధ్యం, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఇ పి.సత్య కుమారి, డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, డిసిపి హరిదాస్‌, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీ చరణ్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, ఉద్యాన సహాయ సంచాలకులు టివి.శిరిల్‌, వెంకటరావు పాల్గొన్నారు.

➡️