సిఎం సహయ నిధి అందజేత

Feb 20,2024 20:51

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని రాజపులోవ సచివాలయ వాలంటీరు రౌతు పైడిలక్ష్మికి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తన నివాసంలో మంగళవారం రూ.4.50లక్షల సిఎం సహయ నిధి చెక్కును అందించారు. పైడిలక్ష్మి భర్త రాముకు ఇటీవల కాలంలో బ్రెయిన్‌ ఆపరేషన్‌ జరిగింది. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సిఎం సహయ నిధి గురించి దరఖాస్తు చేయగా మంజూరైంది. ఆ చెక్కును ఎమ్మెల్యే ఆమెకు అందించారు. నెల్లిమర్ల: సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల పక్షపాతి అని ఎమ్మెల్సీ డాక్టర్‌ పి.వి.వి. సూర్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం మొయిదలో సీఎం సహయ నిధి చెక్‌ బాధిత కుటుంబానికి అందజేశారు. ఆ గ్రామానికి చెందిన శీర వెంకట్రావు ప్రమాదంలో మరణించడంతో ఎమ్మెల్సీ కృషితో ఆ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి 2.20 లక్షలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సంతోష్‌ బాబు, సర్పంచ్‌ అట్టాడ కృష్ణ, నాయకులు ధవళ లక్ష్మణరావు, వై. కృష్ణ, టి.శంకరరావు పాల్గొన్నారు.బొబ్బిలి: పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఆపదలో అండగా ఉంటుందని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఐదుగురుకు రూ.10.10లక్షల మంజూరు కాగా ఆ చెక్కులను మంగళ వారం లబ్ధిదారులకు అందజేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్‌ నాయుడు, వైసిపి నాయకులు బలగ సాయికృష్ణ, చప్ప శేఖర్‌, గొట్టాపు అప్పారావు, ఉన్నారు.

➡️