సిఐటియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

Jan 14,2024 22:43
సిఐటియు 2024 క్యాలెం

ప్రజాశక్తి – కాకినాడ

సిఐటియు 2024 క్యాలెం డర్‌ను జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జి ఆవిష్కరించారు. నగరంలోని కచేరిపేట ప్రాంతంలో ఉన్న లక్ష్మిదాస్‌ భవన్‌లో ఆదివారం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సామాజిక ఉద్యమకారుల చిత్ర పటాలతో, ప్రజలకు సామాజిక స్పృహను అందించేలా సిఐటియు క్యాలెండర్‌ను అందించడం జరిగిందని, అందుకు సహ కరించిన ప్రకటనకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, కోశాధికారి మలకా రమణ, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, వర్కింగ్‌ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకటరమణ, నర్ల ఈశ్వరి, చెక్కల వేణి, ఆఫీస్‌ కార్యాదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు.

➡️