సిఐటియు జిల్లా తరగతులను జయప్రదం చేయండి

ప్రజాశక్తి – మార్కాపురం: రూరల్‌ సిఐటియు ప్రకాశం జిల్లా శిక్షణ తరగతులు మార్కాపురం పట్టణంలో ఈనెల మార్చి 16,17 తేదీల్లో జరుగుతున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం నందు జిల్లా శిక్షణ తరగతులు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు డీకేఎం రఫీ మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగ హక్కుల కోసం నిరంతరం సిఐటియు పోరాడుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరించే ప్రయత్నాలను సిఐటియు విశాల ఐక్య పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తుందని, హక్కుల కోసం పోరాడుతున్న వారికి సంఘీభావం తెలియజేస్తూ వారికి అండగా నిలబడుతుందని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షణ కోసం విశాల ఉద్యమాలు సిఐటియు నడుపుతుందని అన్నారు. స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని స్కీములకు నిధులు పెంచాలని సిఐటియు ఉద్యమం చేస్తుందని అన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని,అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి వారి హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. అనునిత్యం ఉద్యోగులు కార్మికుల కోసం పోరాడుతున్న సిఐటియుని ఆదరించాలని సిఐటియు నిర్వహణకు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కే సుబ్బరాయుడు, పి.రుబెన్‌ మిడ్‌ డే మిల్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు టి గురునాథం, మండల నాయకులు జె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️