సిపిఎం నాయకుల నిరాహార దీక్ష

Jan 22,2024 21:25
ఫొటో : దీక్ష చేపడుతున్న సిపిఎం నాయకులు

ఫొటో : దీక్ష చేపడుతున్న సిపిఎం నాయకులు
సిపిఎం నాయకుల నిరాహార దీక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి : సమ్మె చేపడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై నిరంకుశ ధోరణి వీడి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు సిపిఎం రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపుమేరకు నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సిఐటియు నాయకులు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు అంగన్‌వాడీలపై ప్రభుత్వం చేపట్టిన అక్రమ అరెస్టులు, నిర్బంధాలను నిరసిస్తూ ఈ దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఓ వైపు చర్చలు జరుపుతూనే అంగన్‌వాడీలను తొలగించడం జగన్‌ నిరంకుశ పాలనకు అద్దం పట్టిందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి బయల్దేరిన అంగన్‌వాడీలను అర్ధరాత్రి నిర్బంధాలను గురి చేయడం మహిళలకు అర్ధరాత్రి స్వేచ్ఛ విధానంపై జగన్‌ మొండి వైఖరి మహిళలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. పాదయాత్రలో వెయ్యి రూపాయలు పెంచుతామన్న హామీనిచ్చిన ముఖ్యమంత్రి మహిళలపై ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఫర్ధిన్‌ బాషా, ఎంపిటిసి కాకు విజయ, కోడె రమణయ్య, వెంకటేశ్వర్లు, ఈర్ల సుజాత పాల్గొన్నారు.

➡️