సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్‌

Mar 13,2024 21:46

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జెఎన్‌టియులో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధ్వర్యంలో రెండు రోజులు పాటు జరగనున్న జాతీయ సెమినార్‌ బుధవారం యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ కె.వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సివిల్‌ ఇంజినీరింగ్‌ను రాయల్‌ సివిల్‌గా ఆయన వర్ణించారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీని అందిపుచ్చుకొని అనుకున్నలక్ష్యాలను సాధించుకోవాలన్నారు. అనంతరం సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రాధాన్యత, ఉపయోగాల గురించి అధ్యాపకులు వివరించారు. సెమినార్‌లో వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️