సూపర్‌ సిక్స్‌’ను ప్రతిఒక్కరికీ అవగాహన

Mar 3,2024 21:49

ప్రజాశక్తి – వీరఘట్టం :బాబు షూరిటీ …భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్‌ సిక్స్‌ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని పట్టణ టిడిపి అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, టిడిపి సీనియర్‌ నాయకులు బల్ల హరిబాబులు కోరారు. ఆదివారం జామి కాంప్లెక్స్‌లో పట్టణ టిడిపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్‌ సిక్స్‌ పథకాల వివరాలను ఆయా కుటుంబాల వారికి వివరించాలన్నారు. వీరంతా ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా టిడిపి విధి విధానాలను కూడా వివరిస్తారని వారు తెలిపారు. వీరంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తూముల రమేష్‌ రాయపల్లి రత్నాకర్‌ రావు జామి సింహాచలం జలుమూరు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు .సీతంపేట : బాబు ష్యురిటీ -భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మండలంలోని బెన్నరాయి, ఇప్పగూడ, జలుబు గూడా, వలస గూడా, లాడా పెద్ద గూడలో మండల టిడిపి అధ్యక్షుడు సవర తోట ముఖలింగం, ఎస్‌సి సెల్‌ మండల అధ్యక్షుడు గంటా సుధ,నియోజవర్గం సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ ముటక భారత్‌ రాజు, యూనిట్‌ ఇంఛార్జి సోను,ఉమ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్రజలకు భవిష్యత్‌ ఉంటుందని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి ప్రజలకు అమలు చేయడంలో విఫలం అయిందని విమర్శించారు. టిడిపికి మహిళలంతా అండగా ఉండి, పార్టీ గెలుపునకు కృషి3 ఏయాలని కోరారు కార్యక్రమం లో రాంమూర్తి, వెంకటేష్‌ , ధర్మారావు, ప్రసాద్‌, ఎలీషా,బాలరాజు,చిన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరాడ : రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని టిడిపి అరకు పార్లమెంట్‌ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు అన్నారు. ఆదివారం చంద్రంపేటలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం మండలంలోని విక్రంపురం పంచాయతీ చంద్రంపేటలో సూపర్‌ సిక్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్రంపురం ఎంపిటిసి అరకు పార్లమెంట్‌ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి అధోగతి పట్టిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం పక్కన పెడితే అభివద్ధి శూన్యమని అన్నారు. త్వరలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. కార్యక్రమం లో పొట్లూరు వెంకట నాయుడు, గొట్టపు తినాధ, పల్లి రామారావు, బూత్‌ కన్వీనర్‌ శశిభూషణరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.’

➡️