సృజన, మానసిక వికాస సమ్మేళనమే బాలోత్సవం

ప్రజాశక్తి – కడప ప్రతినిధిసృజన, మానసికోల్లాస సమ్మేళనమే బాలోత్సవానికి చిరునామా అని డిఇఒ ఎద్దుల రాఘవరెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఒ డాక్టర్‌ ఎ.ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలోని సెయింట్‌జోసెఫ్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పరిశ్రమల శాఖ రిటైర్డు డిప్యూటీ డైరెక్టర్‌ బి.గోపాల్‌ అధ్యక్షతన నిర్వహించిన బాలోత్సవం నిర్వహించారు. తొలుత ప్రభాకరరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఒ రాఘవరెడ్డి మాట్లాడుతూ పాశ్చాత్యదేశాల్లో బాలల హక్కులకు బ్రహ్మరథం పడతారన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రహ్లాదుని దగ్గర నుంచి బాలల హక్కుల వికాసానికి ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. పాఠశాలల్లో చివరి రెండు పీరియడ్లలో బాలల హక్కుల పట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోయిందని, ఇటువంటి ఒత్తిడికి బాలోత్సవాలు విరుగుడు కలిగిస్తాయని తెలిపారు. బాలోత్సవ కమిటీ 42 విభాగాల ద్వారా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తోందని కొనియాడారు. చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఏర్పడిందని ఉద్భోదించారు. పాటలు, శ్లోకాలు, మాటలనే అంశాలను మంత్రాలుగా భావించి అభ్యాసం చేయాలన్నారు. నైతిక విలువలను కలిగి ఉండడంతోపాటు జ్ఞానంతోపాటు లోకజ్ఞానాన్ని అలవరుచుకోవాలని తెలిపారు. రిటైర్డు జాయింట్‌ డైరెక్టర్‌ ఆలపాటి పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ బాలల హక్కులను ప్రభుత్వానికి వదిలేయడం తగదని, ప్రభుత్వం తోపాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో మానవతా విలువల పెరుగుదల, మెరుగైన సృజన, వ్యక్తిత్వ వికాసానికి విద్యాజ్ఞానమే ఉపకరి స్తుంద న్నారు. డాక్టర్‌ ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజం పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళనలతో కూడి ఉందన్నారు. చదువు ఒక్కటే ఎదుగుదలకు పరిష్కారమని భావించడం సమంజ సమేనని, కానీ పిల్లలందరూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనే ధోరణిని మానుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సానబట్టడంపై దృష్టి సారించాలన్నారు. నీట్‌, జెఇఇ ర్యాంకులు రాని వారిపట్ల సమాజం వ్యతిరిక్త ధోరణితో ప్రవరిస్తుండడం ఆందోళనకరమన్నారు. ప్రముఖ కవులు సత్తార్‌ఫైజీ, బాలయల్లారెడ్డి మాట్లాడుతూ బాలోత్సవాలు నిర్వహించాలనే ఆలోచన రావడం అద్భుతమని కొనియాడారు. బాలల వికాసానికి, అభివృద్ధి, సంక్షేమాలకు శ్రీకారం చుట్టడమేనని తెలిపారు. సమాజంలోని 64 కళల్లో తమకు ఎన్ని వస్తున్నాయోనని, తమ నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయోనని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలోత్సవ కమిటీ సభ్యులు లకీëరాజా మాట్లాడుతూ పిల్లలో దాగి ఉన్న సృజనను వెలికి తీయడానికి బాలోత్సవానికి రూపకల్పన చేశామన్నారు. ఎస్‌వి ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన డ్రాయింగ్‌ పోటీలకు లభించిన ఆదరణ చూసి బాలోత్సవాలను పూనుకున్నామని తెలిపారు. మహిళాశిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌ రోహిణి మాట్లాడుతూ బాలోత్సవాన్ని గెలుకునేందుకు శ్రమించాలన్నారు. అవార్డులు, బహుమతులు లభించని విద్యార్థులు నిరుత్సాహానికి గురిగాకుండా వచ్చే ఏడాది నిర్వహించే బాలోత్సవంలో అవార్డులు, గుర్తింపు లభించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం బాలోత్సవ కమిటీ నిర్వాహకులు వేమన, పుట్టపర్తి, లక్కోజి ప్రాంగణాల్లో నిర్వహించనున్న కళలను విభాగాలుగా విభజించి అకడమిక్‌, నాన్‌అకడమిక్‌ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. అనంతరం ఆయా విభాగాలుగా ఎంట్రీలు నమోదు చేసుకున్న సుమారు రెండు వేల మంది విద్యార్థులు సాయంత్రం ఐదు గంటల వరకు తమ ప్రదర్శనల్ని నిర్వహించడానికి పోటీ పడడం అబ్బురాన్ని కలిగించింది. జానపద, శాస్త్రీయ సంగీత, చారిత్రక పోరాట, వ్యాస పరీక్షల విన్యాసాలను అసమాన రీతిలో ప్రదర్శించడంతో సందర్శకులతో ప్రాంగణమంతా నిండి పోయింది. ప్రతి విభాగంలో విద్యార్థుల బృందం నిర్వహించిన ప్రదర్శనలతో సంబ్ర మాశ్చర్యాలతో కరతాళ ధ్వనులతో చూస్తుండి పోవడం విస్మయాన్ని కలిగించింది. బాలోత్సవ కార్యక్రమంలో తవ్వా సురేష్‌రెడ్డి, రిటైర్డు డిప్యూటీ డిఇఓ నాగమునిరెడ్డి, బాలోత్సవ కమిటీ సభ్యులు పి.మహేష్‌, సునీత, మ్యత్యుం జరావు, ఉషా తులసి, ఎల్లేశ్వ రరావు, వెంకటే శ్వర్లు, మధు, శివరాం, నాగమునిరెడ్డి, దేవదత్తం, అరుణ, రవికుమార్‌, వెంకటసుబ్బయ్య, జిల్లా నలుమూలల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

➡️