సెంట్రల్‌ జైల్లో జిల్లా న్యాయమూర్తి తనిఖీలు

Dec 2,2023 23:52
పరిశీలనలో భాగంగా

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రాజమహేంద్రరం సెంట్రల్‌ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శనివారం సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిని, అక్కడ ఉన్న వైద్య సదుపా యాలను పరిశీలించారు. వంటశాలను, ఆహార ప్రమా ణాలను పరిశీలిం చారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. వెల్డింగ్‌, ఇతర శిక్షణల్లో శిక్షణ పొందుతున్న ఖైదీలతో మాట్లాడారు. విడుదలైన తరువాత జీవనోపాధి కోసం ఈ శిక్షణ ఉపాయోగకరంగా ఉంటుందని అన్నారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్‌ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ వివరించాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళా కారాగారాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి కేసు వివరాల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. కారాగార వైద్య సిబ్బందితో మాట్లాడి ఖైదీల ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పరిశీలనలో భాగంగా ఖైదీలతో కలిసి భోజనం చేశారు.

➡️