సేవాదల్‌ వందేళ్ల ఉత్సవాల్లో డోల

Dec 29,2023 20:51

ప్రజాశక్తి-విజయనగరం కోట :   కాంగ్రెస్‌ పార్టీ సేవాదల్‌ స్థాపించి వందేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి డోల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అక్కడ గాంధీ పార్క్‌ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన సేవాదళ్‌ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకొని వందేళ్ల ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సిడబ్ల్యుసి సభ్యులు పల్లంరాజు, విజయనగరం నాయకులు జమ్ము ఆదినారాయణ పాల్గొన్నారని తెలిపారు.

➡️