సైమన్‌ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేత

చెక్కును అందిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో యుటిఎఫ్‌ కుటుంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మతి చెందిన మందపల్లి సైమన్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులకు రూ.మూడు లక్షల చెక్కును యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డివి రాఘవులు, కుటుంబ సంక్షేమ పథకం అధ్యక్షులు జ్యోతి బసు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుటుంబంలో ఎవరికైనా కుటుంబ సభ్యులు కోల్పోయిన సందర్భంలో వారికి ఆసరాగా ఉంటుందని 1995లో ్‌ చిట్టిబాబు ఆలోచన నుంచి కుటుంబ సంక్షేమ పథకం పుట్టిందన్నారు. ప్రారంభంలో రూ.30 వేల నుంచి దశలవారీగా ఈరోజు రూ.మూడు లక్షలు సంఘీభావ విరాళం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌, మండపేట, ఆలమూరు ఎంఇఒలు సోమిరెడ్డి, పి.శాలెం రాజు, రాష్ట్ర కౌన్సిలర్‌ గోపాలకృష్ణారెడ్డి, రూరల్‌ అధ్యక్షులు ఎం.త్రినాధరావు, యుటిఎఫ్‌ నాయకులు నల్లి విశ్వనాథ్‌, పెంకే వెంకటేశ్వరరావు, ఎంటివి ఎ.సుబ్బారావు, జి.రాజు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️