స్కౌట్‌ యూనిట్‌ను ప్రారంభించిన డిఇఒ

నరసరావుపేట: స్థానిక శంకర భారతిపురం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో శుక్ర వారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పాల్గొని భారత స్కౌట్‌, గైడ్స్‌ యూనిట్‌ను ప్రారం భించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు ఎం. పార్వతి అధ్యక్షత వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో స్కౌట్‌ యూనిట్స్‌ ను ప్రారం భించాల్సిన అవశ్యకత ఉందని, శంకరభారతిపురం పాఠశాల అన్ని రంగాల్లో ముందుంటూ స్కౌట్‌ యూనిట్‌ను ప్రారంభించిన మమ్మీ వెంకటరెడ్డిని అభినందిం చారు. ప్రధానోపాధ్యాయురాలు ఎం.పార్వతి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి సేవాభావం క్రమశిక్షణ కలిగించడంలో స్కౌట్‌ యూనిట్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో నరస రావుపేట లోకల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం. కృష్ణయ్య, బివిఎఎల్‌. వరప్రసాద్‌ పాల్గొన్నారు

➡️