స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ఎంఎల్‌సి ‘పర్వతరెడ్డి’ హాజరు

Nov 28,2023 20:52
మాట్లాడుతున్న ఎంఎల్‌సి

మాట్లాడుతున్న ఎంఎల్‌సి
స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ఎంఎల్‌సి ‘పర్వతరెడ్డి’ హాజరు
ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్‌ : నెల్లూరు జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం జెడ్‌పి కార్యాలయంలో జరిగింది. జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్య, వైద్య రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా విద్యాశాఖలో ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంపై డిఇఒతో చర్చించారు ఆ షోకా కాజ్‌ నోటీసుల విషయంలో ఉపాధ్యాయులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వివరణలతో సరిపెట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ అధి కారులతో మాట్లాడి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేయడంలో నెల్లూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలవడంపై వైద్య శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రీ ప్రైమరీలో స్కూల్స్‌ లో మెర్జ్‌ అయిన అంగన్‌వాడీ సెంటర్‌ లలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

➡️